టోలిచౌకి కూడలి వద్ద లోకల్, బీహార్ లేబర్ ల మధ్య గొడవ
టోలిచౌకి కూడలి వద్ద లోకల్, బీహార్ లేబర్ ల మధ్య గొడవ జరిగి ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్న ఘటన హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
దిశ,కార్వాన్ : టోలిచౌకి కూడలి వద్ద లోకల్, బీహార్ లేబర్ ల మధ్య గొడవ జరిగి ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్న ఘటన హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ గొడవ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇస్పెక్టర్ మల్లేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం టోలిచౌకి లేబర్ అడ్డ వద్ద లోకల్, బీహార్ లేబర్ లు పని కోసం నిలబడ్డారు. బిహారీ, లోకల్ లేబర్లకు పని విషయంలో మాటా, మాటా పెరిగి గొడవ పడ్డారు. 100 కు ఫోన్ రావడంతో వెంటనే పోలీసులు వెళ్లారు. కాగా అప్పటికే వారు వెళ్ళిపోయారు. ఈ ఘటన పై ఎలాంటి ఫిర్యాదు రాలేదని సీఐ తెలిపారు.