Chikoti Praveen Kumar : హిందూ దేవుళ్ళను విమర్శిస్తున్న వ్యక్తి పై చికోటి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు..

మత విశ్వాసాలను అవమానిస్తూ, హిందూ దేవతల పై అగౌరవ వ్యాఖ్యలు చేస్తూ, మతాల మధ్య మతపరమైన హింసను సృష్టించి, హిందూ దేవతలను పదేపదే విమర్శ చేస్తున్న కదిరె కృష్ణ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చీకోటి ప్రవీణ్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Update: 2024-07-22 12:12 GMT

దిశ, జూబ్లిహిల్స్ : మత విశ్వాసాలను అవమానిస్తూ, హిందూ దేవతల పై అగౌరవ వ్యాఖ్యలు చేస్తూ, మతాల మధ్య మతపరమైన హింసను సృష్టించి, హిందూ దేవతలను పదేపదే విమర్శ చేస్తున్న కదిరె కృష్ణ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చీకోటి ప్రవీణ్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని విమర్శిస్తూ, అవమానిస్తూ సోషల్ మీడియా గ్రూప్‌లు యూట్యూబ్‌లలో ఒక వీడియో సర్క్యులేట్ అయ్యిందని అన్నారు.

ఆ వీడియోను ప్రముఖ వృత్తిలో ఉన్న న్యాయవాది, సామాజిక కార్యకర్త అయిన ఒక డా.కదిరే కృష్ణ ప్రచారం చేశారని అన్నారు. తన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ దేవతలు, మతం పై అసంబద్ధమైన వ్యాఖ్యలను పాస్ చేస్తూ నాస్తికత్వాన్ని ప్రచారం చేశాడన్నారు. హిందువుల మతపరమైన మనోభావాలను, దెబ్బతీసే వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే వీడియోను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లలో సర్క్యులేట్ చేసిన కదిరే కృష్ణ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చీకోటి ప్రవీణ్ కుమార్ వీడియోని జత చేస్తూ జూబ్లిహిల్స్ ఇన్స్పెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News