నడిరోడ్డుపై నోట్ల కట్టలు కలకలం

ఆదివారం మధ్యాహ్నం సమయం.. మియాపూర్ ఆల్విన్ చౌరస్తా సిగ్నల్ వద్ద జనాలు వాహనాలపై దూసుకుపోతున్నారు

Update: 2025-03-16 10:32 GMT

దిశ, శేరిలింగంపల్లి : ఆదివారం మధ్యాహ్నం సమయం.. మియాపూర్ ఆల్విన్ చౌరస్తా సిగ్నల్ వద్ద జనాలు వాహనాలపై దూసుకుపోతున్నారు. ఎవరి పనుల్లో వారు హడావుడిగా వెళ్తున్నారు. ఇంతలోనే నడిరోడ్డుపై ఎవరివో అనుకోకుండా రూ.500 నోట్ల కట్టలు పడిపోయాయి. ఆల్విన్ జంక్షన్ వద్ద పాయింట్ డ్యూటీ చేస్తున్న మియాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన రాజేష్ నోట్ల కట్టలను గమనించాడు. వెంటనే అక్కడికి వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నాడు. వాటిని మియాపూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. రోడ్డుపై పడిపోయిన మూడు నోట్ల కట్టల విలువ రూ.1,50,000 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మియాపూర్ ఆల్విన్ చౌరస్తాలో పడిపోయిన నోట్ల కట్టలు ఎవరివి, ఎలా పడిపోయాయి అనే వివరాలను సీసీ కెమెరాల ఆధారంగా చెక్ చేస్తున్నారు మియాపూర్ పోలీసులు.


Similar News