Hyderabad : నాంపల్లి బీజేపీ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత వాతావరణం
హైదరాబాద్(Hyderabad) లోని నాంపల్లిలో బీజేపీ ఆఫీస్(Nampally BJP Office) దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని నాంపల్లిలో బీజేపీ ఆఫీస్(Nampally BJP Office) దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 'అయోధ్యలో రామ మందిరం ప్రారంభం అయినరోజే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజని' ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(RSS Cheif Mohan Bhagavath) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. మోహన్ భగవత్ వ్యాఖ్యలు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తక్కువ చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఈ వ్యాఖ్యలని నిరసిస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్(Telangana Youth Congress) నేతలు నేడు రాష్ట్ర బీజేపీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. అటువైపుగా వచ్చే దారులను అన్నిటినీ మూసివేసి గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా ఇటీవల ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీసుపై దాడి చేసి, అడ్డుకున్న వారిని చితకబాదారు.