ఎల్బీనగర్ లో బీజేపీ పటిష్టం..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఓటమి పాలు కావడంతో బీజేపీ రాష్ట్ర అధిష్టానం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధుల పై, నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిశ, ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సామ రంగారెడ్డి ఓటమి పాలు కావడంతో బీజేపీ రాష్ట్ర అధిష్టానం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధుల పై, నాయకుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 9 డివిజన్లలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు నిత్యం ప్రజలతో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న కార్పొరేటర్లు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి గెలవడం ఖాయమని నియోజకవర్గంలో చర్చనీయంగా మారింది. కానీ ఇందుకు విరుద్ధంగా అభ్యర్థి సామరంగారెడ్డి ఓడిపోవడం వల్ల కిందిస్థాయి కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ లోపం జరిగిందని నాయకులు కార్పోరేటర్లు సక్రమంగా పనిచేయలేక పోయారా అని కింది స్థాయి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలో యువత భారత ప్రధాని మోడీ నాయకత్వంలో సైనికుల వలె డివిజన్లో పనిచేస్తూ ఉన్నప్పటికీ యువత శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించకపోవడంతో యువత నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో చైతన్యపురి, కొత్తపేట్, గడ్డి అన్నారం, నాగోల్, మనసురాబాద్, హయత్ నగర్ వనస్థలిపురం, బీఎన్.రెడ్డి నగర్, చంపాపేట్ డివిజన్లో కార్పొరేటర్లు ఎన్నికల సందర్భంగా నిత్యం కాలనీలలో అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం నిర్వహించినప్పటికీ అభ్యర్థి ఓటమికి గురి కావడం చర్చనీయాంశంగా మారింది. 9 మంది కార్పొరేటర్లు ఉన్న ఎల్బీనగర్ లో కార్పొరేటర్లు సక్రమంగా పనిచేయకపోవడమా లేక అభ్యర్థి సామ రంగారెడ్డి పై కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారా అనే అంశంలో అధిష్టానం కిందిస్థాయి కార్యకర్తలతో ఓటమికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నగరంలోని గోషామయిల్ నియోజకవర్గంలో ఐదు మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ తన ప్రత్యర్ధుల పై విజయం సాధించారు. ఎల్బీనగర్ లో 9 మంది కార్పొరేటర్లు ఉన్న సామరంగారెడ్డి ఓటమి పాలు కావడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.