11 ఏళ్లుగా పోరాటం.. న్యాయం జరగలేదని ప్రగతి భవన్ ఎదుట ఆత్మహత్యాయత్నం

సోమవారం ఉదయం ప్రగతి భవన్ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.

Update: 2023-01-30 11:26 GMT
11 ఏళ్లుగా పోరాటం.. న్యాయం జరగలేదని ప్రగతి భవన్ ఎదుట ఆత్మహత్యాయత్నం
  • whatsapp icon

దిశ, ఖైరతాబాద్: సోమవారం ఉదయం ప్రగతి భవన్ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఇబ్రహీంపట్ననికి చెందిన మాషమోని ఐలేష్ తన భార్య అనురాధ, ముగ్గురు పిల్లలు అక్షిత (10), మనితేజ ( 9), సాయి తేజ(8) కలిసి ప్రగతి భవన్ ఎదుట కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వివరాల్లోకి వెళ్లితే.. గతంలో నిరుపేదల బతుకు దెరువు కోసం ఇచ్చిన భూములు.. ప్రస్తుత ప్రభుత్వ అధికారులు తప్పుడు పత్రాలతో అక్రమార్కులకు, భూ బకాసురులకు కట్టబెడుతూ.. పేదోడి పొట్టగొడుతున్నారని ఆవేదనకు గురై ఆత్మహత్యకు ప్రయత్నించారు. అక్కడే పోలీస్ అప్రమత్తమై వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

అయితే ఐలేష్‌కు బాగా యత్ ఇబ్రహీంపట్నం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 58 లో విస్తీర్ణం 5-00 ఎకరాల భూమిని పట్టా నెం.306 తో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు తెలంగాణ వారు ఇచ్చిన భూమిపై వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆ భూమిని ప్రభుత్వం వారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కోసం రైతులకు నష్టపరిహారం చెల్లించి భూసేకరణ ద్వారా 2010 సంవత్సరంలో తీసుకున్నారు. అయితే అందరి మాదిరిగానే తమకు నష్ట పరిహారం వస్తుందని ఆశించారు. కానీ, ప్రభుత్వ అధికారులు కొందరు అక్రమార్కులతో కలిసి చేసిన కుట్రతో తమ భూమిపై అక్రమంగా ఇతరుల పేరు నమోదు చేసి, ఫేక్ సర్టిఫికెట్లు, పట్టా పాస్ పుస్తకం తయారు చేసి ప్రభుత్వం వారి ద్వారా వచ్చిన నష్టపరిహారం కాజేశారు.

ఈ విషయమై అధికారులను అడగడంతో మీ పట్టా నెంబర్ 306 కు బదులుగా.. 307 అని తప్పు పడిందని, కావున మీకు మరొక చోట భూమి ఇస్తామని భూదాన యజ్ఞ బోర్డు చైర్మన్ శ్రీ గున్న రాజేందర్ రెడ్డి అన్నారు. కొంత మంది అధికారులు మారుతుండటంతో కొంత వరకు డబ్బులు ఖర్చు అవుతాయని అంటే.. ఇల్లు అమ్మి ఆడిగిన డబ్బులు ఇచ్చినాను. ఇంతవరకు భూమి చూపించలేదని తెలిపారు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత భూదాన యజ్ఞ బోర్డులో జరుగుతున్న అక్రమాలను గ్రహించిన సీఎం.. అప్పుడు ఉన్న భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డిని సస్పెండ్ చేసి బోర్డు మొత్తాన్ని సి.సి.ఎల్.లో ప్రభుత్వం వారు విలీనం చేసినారు.

కాగా.. అధికారులు తమ భూమి ఇప్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది లక్షల వరకు ఖర్చు చేయించారని, భార్య పిల్లలను రోడ్డున పడేసారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమార్కులకు అండగా నిలుస్తున్న సి.సి.ఎల్ లో భూధాన్ యజ్ఞ బోర్డు పనులను పర్యవేక్షించే అధికారులు అని ఆరోపిస్తూ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, భూమి ఇప్పించి తమ కుటుంబానికి న్యాయం చేయగలరని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

Tags:    

Similar News