Hyderabad Metro Station : మరో సూసైడ్ కలకలం

హైదరాబాద్ మెట్రోస్టేషన్‌లో మరో సూసైడ్ కలకలం రేపింది. ఇటీవల ఎర్రగడ్డ మెట్రోస్టేషన్‌పై నుంచి దూకి మరియమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన

Update: 2023-01-06 08:20 GMT
Hyderabad Metro Station : మరో సూసైడ్ కలకలం
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ మెట్రోస్టేషన్‌లో మరో సూసైడ్ కలకలం రేపింది. ఇటీవల ఎర్రగడ్డ మెట్రోస్టేషన్‌పై నుంచి దూకి మరియమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే, మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. ముసాపేట్‌ మెట్రోస్టేషన్‌లో ట్రైన్‌ కింద దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం రాత్రి 9 గంటల సమయంలో రైలు వస్తుండగా చూసి ఒక్కసారిగా పట్టాలపైకి దూకి ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఘటనపై ముసాపేట్‌ స్టేషన్‌ కంట్రోలర్‌ పులెందర్‌రెడ్డి కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్దేశపూర్వకంగానే వ్యక్తి ట్రైన్‌ కింద దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. అయితే సెక్యూరిటీ చెకింగ్ తో పాటు, టికెట్ ఉంటేనే మెట్రో ప్లాట్ ఫాం మీదకు అనుమతి ఉంటుంది. కానీ, ఆ వ్యక్తి టికెట్‌ లేకుండా మెట్రో స్టేషన్‌ నుంచి ప్లాట్‌ఫామ్‌ పైకి వచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స మేరకు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందాడు. కాగా, అతను స్థానికంగా నివసించే వ్యక్తి అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Also Read...

నిజాలను నిర్భయంగా రాస్తున్న 'దిశ' : డీఎస్పీ రాఘవేంద్రరావు 

Tags:    

Similar News