కేసీఆర్ దళిత ద్రోహి: సంపత్ కుమార్
సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్కొన్నారు..
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్కొన్నారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్విగ్రహాన్ని ముట్టుకునే అర్హత కేసీఆర్కు లేదన్నారు. జయంతి, వర్ధంతిలను అధికారికంగా ఇప్పటి వరకు నిర్వహించలేదన్నారు. దీంతో 125 అడుగుల అంబేద్కర్విగ్రహావిష్కరణకు కేసీఆర్ను అనుమతించకూడదని పేర్కొన్నారు. దళితులను మోసం చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాన్ని వాడుకొని దళితులను దగా చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. నేరెళ్ల, మరియమ్మ లాకప్డెత్ల ఘటనలను ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్మాట తప్పారని గుర్తు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి కేసీఆర్ తొమ్మిదేళ్ల పాపాలను కడుక్కోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతం మాట్లాడుతూ కేసీఆర్ దళితులకు చేసిన ద్రోహంపై ఈ నెల 14న ఛార్జిషీట్ విడుదల చేస్తామన్నారు. దళితబంధును బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు.