హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

నలుగురిని పెట్రోల్ పోసి చంపిన కేసులో ఒక ముద్దాయికి మరణశిక్ష ఇంకో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్షను నాంపల్లి అడిషనల్ సెషన్స్ జడ్జి వినోద్ కుమార్ తీర్పును వెలువరించారు.

Update: 2024-12-20 16:32 GMT

దిశ, హిమాయత్‌నగర్‌ : నలుగురిని పెట్రోల్ పోసి చంపిన కేసులో ఒక ముద్దాయికి మరణశిక్ష ఇంకో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్షను నాంపల్లి అడిషనల్ సెషన్స్ జడ్జి వినోద్ కుమార్ తీర్పును వెలువరించారు. కేసు పూర్వపరాలు పరిశీలిస్తే 2022లో రాగుల సాయి అనే వ్యక్తి తన మాజీ భార్య ఆర్తికి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో రాగుల సాయి (27) స్నేహితుడైన నాగరాజును ఆర్తి రెండో వివాహం చేసుకుంది. నాగరాజు పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్తిని పలుమార్లు వేధింపులకు గురిచేశారు. నాగరాజు రాగుల సాయి ని ఆర్తిని చెల్లిగా పిలవాలని తెలపడంతో కక్ష పెంచుకున్న రాగుల సాయి అతని స్నేహితుడు రాహుల్(26) ఇద్దరు కలిసి గర్భంతో ఉన్న ఆర్తిని, నాగరాజు, సంవత్సరం కొడుకు విష్ణుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. సంఘటన స్థలానికి చేరుకున్న నారాయణగూడ పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేసుకొని కేసు నమోదు చేశారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆ నలుగురు మృతి చెందడంతో అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. నారాయణగూడ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి చార్జ్ ఫైల్ చేశారు. ఈ కేసును మొదటి ప్రాధాన్యత కేసుగా తీసుకున్న నాంపల్లి క్రిమినల్ కోర్టు జడ్జి వినోద్ కుమార్ శుక్రవారం నిందితుడైన రాగుల సాయికి మరణశిక్ష, అతని స్నేహితుడైన రాహుల్ కు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించారు.


Similar News