ఆరుషి నాగ భైరవ కూచిపూడి నృత్య అరంగేట్రం

సంగీత సప్తస్వరాలకనుగుణంగా నృత్య కదలికలతో ఆరుషి నాగభైరవ కూచిపూడి ఆరంగేట్ర నృత్య ప్రదర్శన ఆధ్యాంతం ఆకట్టుకుంది.

Update: 2024-07-07 14:35 GMT

దిశ, శేరిలింగంపల్లి : సంగీత సప్తస్వరాలకనుగుణంగా నృత్య కదలికలతో ఆరుషి నాగభైరవ కూచిపూడి ఆరంగేట్ర నృత్య ప్రదర్శన ఆధ్యాంతం ఆకట్టుకుంది. ఆదివారం మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో ప్రముఖ నాట్య గురువులు నీలిమ గడ్డమణుగు సమక్షంలో ఆరుషి కూచిపూడి ఆరంగ్రేట్ర ప్రదర్శన చేసింది. ప్రదర్శనలో విఘ్నేశ్వరుని ప్రార్ధనతో ప్రారంభించి.. లింగాష్టకం, భామా కలాపం, తరంగం, అన్నమాచార కీర్తన, తిల్లాన, గోవింద నామాలను కూచిపూడి నృత్యరూపకంలో ప్రదర్శించిన తీరు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆరుషి ప్రదర్శనను తిలకించేందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ తో పాటు పలువురు ప్రముఖులు హాజరై ఆరుషిని ప్రత్యేకంగా అభినందించారు.


Similar News