HYD : పహిల్వాన్ల మధ్య ఘర్షణ.. ఎల్బీ స్టేడియంలో హై టెన్షన్!
నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘మోడీ కేసరి కుస్తీ’ పోటీల్లో ఘర్షణ తీవ్ర కలకలం రేపింది.
దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ‘మోడీ కేసరి కుస్తీ’ పోటీల్లో ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు పహిల్వాన్ల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పహిల్వాన్లు కుర్చీలతో దాడులకు దిగడంతో ప్రేక్షకులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేశారు. ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.