HYD : గాంధీ భవన్ వద్ద ఏఈఈ అభ్యర్థుల ఆందోళన

తమకు వెంటనే అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెలెక్టెడ్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

Update: 2024-06-11 07:30 GMT

దిశ, కార్వాన్ : తమకు వెంటనే అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలంటూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సెలెక్టెడ్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం ‘హలో నిరుద్యోగి-ఛలో గాంధీ భవన్’ పేరుతో అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి గాంధీ భవన్ ముందు మోకాళ్ళపై కూర్చొని నిరసన తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..1540 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి 9 నెలలు గడుస్తున్నా పోస్టింగ్‌లు ఇవ్వడం లేదన్నారు. గతంలో పేపర్ లీకేజీ కారణంగా తాము ఏఈఈ ఫలితాలు జాప్యం జరగడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. పరీక్ష రాసి రిజల్ట్ వచ్చి 9 నెలలు గడుస్తున్నా టీఎస్పీఎస్సీ అధికారులు వెరిఫికేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి చొరవ కల్పించుకొని తమకు నియామక పత్రాల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.


Similar News