Huzurabad: సొంత నియోజకవర్గంలో గాడిదపై పాడి కౌషిక్ రెడ్డి దిష్టి బొమ్మ ఊరేగింపు

హుజురాబాద్(Huzurabad) లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Koushik Reddy) దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించారు.

Update: 2025-01-17 14:41 GMT
Huzurabad: సొంత నియోజకవర్గంలో గాడిదపై పాడి కౌషిక్ రెడ్డి దిష్టి బొమ్మ ఊరేగింపు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: హుజురాబాద్(Huzurabad) లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Koushik Reddy) దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించారు. పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడుతూ హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు(Youth Cobgress Leaders), మహిళలు ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దిష్టిబొమ్మకు చీర, పూలు, గాజులు పెట్టి గాడిదపై ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డికి, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై యూత్ కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడేటప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత కౌశిక్ రెడ్డికి లేదని అన్నారు. అలాగే ఆయనపై ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

Tags:    

Similar News