గోవా మందు బాటిళ్లపై ఇన్‌స్టాలో రీల్.. షాకిచ్చిన తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు..!

సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయినప్పటి నుంచి ఎవరు ఏం చేసిన వాటిని రీల్స్ తీసి పోస్ట్ చేస్తున్నారు.

Update: 2024-07-15 11:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయినప్పటి నుంచి ఎవరు ఏం చేసిన వాటిని రీల్స్ తీసి పోస్ట్ చేస్తున్నారు. దీంతో వారికి పాలోవర్స్ పెరుగుతూ ఫేమ్ అవుతున్నారు. కొంతమైంది లైక్స్, కామెంట్ల కోసం రీల్స్ చేస్తూ ఆనందం పొందుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి గోవా నుంచి మద్యం ఎలా తేవాలి అంటూ ఓ రీల్ చేసి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ వీడియోను చూసిన తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అతడికి గట్టి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

హైదరాబాద్‌కు చెందిన బోరిగర్ల ఆనందపాల్ అలియాస్ కోటి యాదవ్ అనే వ్యక్తి ఇటీవల గోవా వెళ్లాడు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఫ్రెండ్స్ కోసమని గోవా నుంచి 15 మద్యం బాటిళ్లను తెచ్చుకున్నాడు. ఈ ఘనకార్యాన్ని నెటిజన్లతో పంచుకోవాలని ఆయన గోవాలో ఎన్ని మద్యం బాటిళ్లు కొన్నది, ఎంత తక్కువ ధరకు కొనుగోలు చేశాడు, ప్యాకింగ్ ఎలా చేయించారు..? ట్రైన్, ఫ్లైట్ ద్వారా ఎలా తెచ్చుకోవాలి అనే వివరాలు వెల్లడిస్తూ ఓ వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోని చూసిన తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు. కోటి యాదవ్ నుంచి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. 1968 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకురావడం నేరంగా పేర్కొంటూ కోటి యాదవ్‌పై కేసు పెట్టారు. ఫ్లైట్‌లో పరిమితికి మించి మద్యం రవాణా చేశాడని అభియోగం మోపారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇకపై రీల్స్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Similar News