నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు? : హైడ్రాను ప్రశ్నించిన హైకోర్ట్

హైదరాబాద్ (Hyderabad) జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో ఆక్రమణలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా 'హైడ్రా' (Hydra) ఏర్పాటైన సంగతి తెలిసిందే.

Update: 2024-09-13 17:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad) జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో ఆక్రమణలపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా 'హైడ్రా' (Hydra) ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్ట్ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణలు తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని హైకోర్ట్ ప్రశ్నించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధతను సవాల్ చేస్తూ లక్ష్మి అనే మహిళ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అమీన్ పూర్లో ఈ నెల 3న గుడిసెలు కూల్చారని, హైకోర్ట్ స్టే ఆర్డర్స్ ఉన్నా కూడా కూల్చివేశారని పిటిషనర్.. తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై హైకోర్ట్ విచారణ చేపట్టి పై వ్యాఖ్యలు చేసింది. 


Similar News