Hit and Run Case: నార్సింగ్ పరిధిలో హిట్ అండ్ రన్.. ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి (Narsinghi Police Station)లో హిట్ అండ్ రన్ కేసు ఘటన చోటు చేసుకుంది. నార్సింగ్ వట్టినాగులపల్లి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో శనివారం ఉదయం టూవీలర్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టూవీలర్‌పై వెళ్తున్న ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి తాపీ మేస్త్రీ పిల్లి గణేశ్‌గా పోలీసులు గుర్తించారు. ఉదయం 9:00 గంటల తర్వాత ప్రమాదం జరిగిన చాలా చాలా సేపటి వరకు మృతదేహం రోడ్డుపైనే ఉందని ఆరోపణలు వచ్చాయి.
రెండు గంటల అనంతరం బాడిని నార్సింగ్ పోలీసులు మార్చురీకి తరలించారు. చనిపోయిన వ్యక్తి గణేశ్ ఆంధ్రప్రదేశ్ ద్రాక్షారామం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక ఘటనపై (Hit and run case) కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. గణేశ్ టూవీలర్‌ను టిప్పర్ వాహనం ఢీ కొట్టినట్లు పొలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.