ములుగు ఎన్ కౌంటర్ కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

ఏటూరు నాగారం సమీపంలోని చల్పాక అటవీప్రాంతంలో (Chalpaka Forest) ఆదివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనపై విపక్షాలు అధికార పార్టీపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

Update: 2024-12-03 08:40 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏటూరు నాగారం సమీపంలోని చల్పాక అటవీప్రాంతంలో (Chalpaka Forest) ఆదివారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనపై విపక్షాలు అధికార పార్టీపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఎన్ కౌంటర్ (Encounter)పై హైకోర్టులో (Telangana High Court) పిటిషన్ దాఖలైంది. మావోయిస్టుల ఎన్కౌంటర్ వెనుక కుట్ర జరిగిందని, మావోయిస్టుల ఆహారంలో విష ప్రయోగం జరిగిందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. మల్లయ్య మృతదేహాన్ని మాత్రం గురువారం వరకూ మార్చురీలో భద్రపరచాలని ఆదేశించింది. మల్లయ్య పోస్టుమార్టం రిపోర్టును అందజేయాలని తెలిపింది. మిగతా మావోయిస్టుల మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

మృతదేహాలను భద్రపరచడం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పగా.. మల్లయ్య మృతదేహాన్ని మాత్రం భద్రపరచాలని, ఎన్ కౌంటర్ పరిణామాలతో పాటు తదుపరి చర్యలకు సంబంధించిన నివేదికను ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

Tags:    

Similar News