భారీ వర్షం.. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.

Update: 2024-08-31 16:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ముఖ్యంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా దంచికొడుతున్న వర్షం కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అసలు వాహనాలు ఎందుకు నిలిచిపోయాయి తెలియక ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన రహదారి పోలీసులు.. అసలు కారణం తెలుసుకున్నారు. నందిగామ వద్ద వాగు పొంగడంతో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలను ఖమ్మం వైపు దారి మళ్లించారు. అలాగే హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లవలసిన వాహనాలను నార్కట్ పల్లి వద్ద అద్దంకి వైపు మళ్లించారు. కావును ఈ మార్గాల్లో ప్రయాణించే వారు గమనించాలని హైవే అథారిటీ అధికారులు సూచించారు.


Similar News