HYD: దంచికొట్టిన వర్షం.. ఆ రూట్లో ఎక్కడికక్కడే నిలిచిన వాహనాలు

హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం దంచికొట్టింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మబ్బులు కమ్మేసి భారీ వర్షం కురిసింది.

Update: 2024-08-19 10:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల వర్షం దంచికొట్టింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మబ్బులు కమ్మేసి భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అనేక చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, రామంతాపూర్, అంబర్ పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్, బేగంపేట సహా అనేక ప్రాంతాల్లో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా చాదర్ ఘాట్ ఎల్బీనగర్ మధ్యలో ట్రాఫిక్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. వివిధ ప్రాంతాలలో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం కురిసే ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆ సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచిస్తుంది.

Tags:    

Similar News