ఈరోజు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2024-09-03 11:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపింది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక బుధవారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని.. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

కాగా మధ్య విధర్భ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విధర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైందని ఐఎండీ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుండి 3.1కిమీ నుండి 5.8కిమీల వరకు ఏర్పడిందని.. దీనివలన మరిన్ని రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది.     


Similar News