మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Update: 2023-05-05 03:36 GMT
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వర్షాలకు అటూ అన్నదాతలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని అంచనా.

Tags:    

Similar News