తెలంగాణకు చల్లటి కబురు.. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షం

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో గత వారం పది రోజుల నుంచి జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈక్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో ఈనెల 18,19 తేదీల్లో ఉరుములు

Update: 2023-08-16 02:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో గత వారం పది రోజుల నుంచి జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈక్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో ఈనెల 18,19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

ఇక వచ్చే రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల మరియు నల్గొండ జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.


Similar News