కవిత పిటిషన్‌పై విచారణ అప్పుడే.. వెబ్‌సైట్‌లో సుప్రీంకోర్టు క్లారిటీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 27న ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 27న ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మహిళలైన తనను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడంపై కవిత ఈ నెల 14న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లు రద్దు చేసిన తనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కవిత తన పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ పై తొలుత మార్చి 24న విచారణ చేస్తామని ధర్మాసనం పేర్కొంది.
అయితే ముందుగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 24వ తేదీకి విచారణకు రావాల్సి ఉండగా తాజాగా కంప్యూటర్ జనరేషన్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 27వ తేదీన విచారణకు రాబోతున్నట్లు సుప్రీంకోర్టు వెబ్ సైట్ స్పష్టత ఇచ్చింది. ఇదిలా ఉంటే కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈడీ సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ వాదన వినేంత వరకు కవిత పిటిషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఈడీ అభ్యర్థించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ తోనే ఈడీ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించనుంది. దీంతో ఈ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది.
ఇవి కూడా చదవండి : తన పొలం వద్దకు సీఎం రాలేదని ఉపసర్పంచ్ ఆవేదన.. సోషల్ మీడియాలో వీడియో వైరల్