పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా

తెలంగాణ అసెంబ్లీకి 2023 లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Update: 2025-03-25 08:10 GMT
పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీకి 2023 లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS party) నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యే (10 MLAs) కాంగ్రెస్ పార్టీ (Congress party)లో చేరారు. దీంతో పార్టీ పిరాయించిన వారిపై చర్యలు తీసుకొవాలిన అసెంబ్లీ స్పీకర్ తో పాటు సుప్రీం కోర్టును.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కేటీఆర్ ఆశ్రయించారు. కాగా ఈ కేసుపై సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి (Telangana Assembly Secretary) సోమవారం సాయంత్రం కౌంటర్ దాఖలు చేశారు. కాగా ఈ రోజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy), కేటీఆర్ (KTR) తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ప్రతివాదులుగా ఉన్న వారిపై సుప్రీం కోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనంతరం ఈ విచారణను సుప్రీం కోర్టుల ఏప్రిల్‌ 2కు వాయిదా (Adjournment of trial) వేసింది. తదుపరి విచారణలో ప్రతివాదుల వాదనలు కోర్టు వినే అవకాశం ఉంది. కాగా ఈ రోజు విచారణలో కౌశిక్‌రెడ్డి (Kaushik Reddy) తరపున లాయర్ సుందరం, కేటీఆర్‌ తరపున శేషాద్రినాయుడు తమ వాదనలు వినిపించారు. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై అసెంబ్లీ కార్యదర్శి (Assembly Secretary).. స్పీకర్ తరుఫున కౌంటర్ దాఖలు చేశారు. అందులో పిటిషనర్లు తప్పుడు ఉద్దేశంతో ఈ పిటిషన్ వేశారని.. స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టును ఆశ్రయించారని.. ఈ పిటిషన్లను కొట్టివేయాలని అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Similar News