Health: ఆసుపత్రులలో తనిఖీల కోసం పది బృందాలు.. మంత్రి దామోదర కీలక ఆదేశాలు
ఆసుపత్రులలో(Hospitals) తనిఖీ(Checkings)ల కోసం పది బృందాలను(Ten Teams) ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి(Health Minister) దామోదర రాజ నర్సింహ(Damodara Raja Narasimha) ఆదేశాలు(Orders) ఇచ్చారు.
దిశ, వెబ్ డెస్క్: ఆసుపత్రులలో(Hospitals) తనిఖీ(Checkings)ల కోసం పది బృందాలను(Ten Teams) ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి(Health Minister) దామోదర రాజ నర్సింహ(Damodara Raja Narasimha) ఆదేశాలు(Orders) ఇచ్చారు. శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్(Govt And Private Hospitals)లో ఫైర్ సేఫ్టీ మెజర్స్(Fire Safety Messurs)పై మంత్రి దామోదర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో(Health Officials) మంత్రి టెలీ కాన్ఫరెన్స్(Tele Conference) నిర్వహించారు. ఈ సందర్భంగా.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల ఉత్తర ప్రదేశ్(UP Incident)లోని ఓ దవాఖానలో ఫైర్ యాక్సిడెంట్(Fire Accident) జరిగి పిల్లలు చనిపోయిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ దవాఖాన్లలో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేసి, నివేదిక తయారు చేయాలని సూచించారు. ఆసుపత్రులలో తనిఖీల కోసం వెంటనే పది బృందాలను ఏర్పాటు చేయాలని, ఈ బృందాలు తొలుత గాంధీ(Gandhi), ఉస్మానియా(Osmania), నీలోఫర్(Nilofer), ఎంజీఎం(MGM) వంటి పెద్ద హాస్పిటళ్లలో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు.
అంతేగాక ఫైర్ అలార్మ్స్fire alarms, స్మోక్ట్ డిటెక్టర్స్smoke detectors ఉన్నదీ, లేనిది పరిశీలించాలని, మంటలను ఆర్పే యంత్రాలు(fire extinguishers) సరిపడా ఉన్నాయో? లేవో చూడాలని, వాటి తుది గడువు తేదీలను చెక్ చేయాలని సూచనలు చేశారు. ఫైర్ సేఫ్టీ, మంటలను ఆర్పే యంత్రాల వినియోగంపై హాస్పిటళ్లలో పనిచేసే సెక్యూరిటీ, ఇతర సిబ్బందికి ట్రైనింగ్(Training) ఇవ్వాలని ఆదేశించారు. హాస్పిటళ్లలో పవర్ సప్లై సిస్టమ్‌ను పరిశీలించాలని, పాత ఎలక్ట్రిక్ కేబుల్స్ ఉంటే, వాటి స్థానంలో, నాణ్యమైన కొత్త కేబుల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫైర్ సేఫ్టీ, షార్ట్ సర్క్యూట్(Short-Circuiting)కు సంబంధించి ఏం చేయాలి.. ఏం చేయకూడదు అని సైన్ బోర్డ్స్(Sign Boards) ఏర్పాటు చేయాలని మంత్రి, హాస్పిటల్‌కు సమీపంలోని ఫైర్ స్టేషన్ సిబ్బందితో హాస్పిటల్ అధికారులు టచ్‌లో ఉండాలని, హాస్పిటల్స్‌లో రెగ్యులర్‌గా ఫైర్ సేఫ్టీ మాక్‌డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఇక ప్రతి హాస్పిటల్‌కు ఫైర్ ఎవాక్యూయేషన్ ప్లాన్(fire evacuation plan) రూపొందించాలని, ఆ ప్లాన్‌పై డాక్టర్లు, స్టాఫ్‌కు అవగాహన కల్పించాలని, ఫైర్ ఎవాక్యూయేషన్ ప్లాన్ (fire evacuation Plan)కు సంబంధించిన సైన్ బోర్డులను హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేయాలని మంత్రి సలహా ఇచ్చారు.