హెచ్‌సీయూ భూముల వ్యవహారం.. ఏబీవీపీ ఆధ్వర్యంలో మహత్తర కార్యక్రమం

హెచ్‌సీయూ భూముల వ్యవహరంలో ఏబీవీపీ విద్యార్థి విభాగం సమగ్రమైన కార్యక్రమాన్ని చేపట్టింది.

Update: 2025-04-05 16:21 GMT
హెచ్‌సీయూ భూముల వ్యవహారం.. ఏబీవీపీ ఆధ్వర్యంలో మహత్తర కార్యక్రమం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: హెచ్‌సీయూ భూముల వ్యవహరం (HCU Land Dispute)లో ఏబీవీపీ విద్యార్థి విభాగం (ABVP Students Wing) సమగ్రమైన కార్యక్రమాన్ని చేపట్టింది. యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను రక్షించేందుకు పలు డిమాండ్లతో కూడిన లేఖను రాసి, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని (Signature collection program) చేపట్టింది. ఈ కార్యక్రమం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (Hyderabad Central University)లోని సౌత్ క్యాంపస్‌ (South Campus)లోని సీఐఎస్ బిల్డింగ్‌ (CIS Building)లో జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఏబీవీపీ హెచ్‌సీయూ (ABVP HCU)కి మద్దతుగా పెద్ద ఎత్తున విద్యార్థులు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాసిన లేఖలో.. పలు కీలక విషయాలు వెల్లడించారు. 02/02/2004న 534 ఎకరాల యూనివర్శిటీ భూమి మార్పిడికి సంబంధించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మధ్య ఎంవోయూ జరిగిందని తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 534 ఎకరాల యూనివర్శిటీ భూమిని ప్రభుత్వానికి ఇచ్చారని, దానికి బదులుగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 397 ఎకరాల భూమిని ఇచ్చిందని, మిగిలిన 137 ఎకరాల భూమిని 3 నెలల్లో ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ వాగ్దానం చేసిన భూమిని ప్రభుత్వం ఇవ్వకుండా ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడిందని అన్నారు. ఆ 534 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం 400 ఎకరాలను ఐఎంజీ భారత్‌కు కేటాయించిందని, మార్పిడిలో భాగంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఇచ్చిన 397 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం TERI, TIFR, NIHB వంటి వివిధ సంస్థలకు తిరిగి కేటాయించిందని, దీని ప్రకారం యూనివర్సిటీ మొత్తం 534 ఎకరాలను కోల్పోయిందని స్పష్టం చేశారు.

ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సెలవులను సద్వినియోగం చేసుకొని 400 ఎకరాల హెచ్‌సీయూ భూమిలో చెట్లను నాశనం చేయడంతో పాటు నివాసాలకు అంతరాయం కలిగించిందని, వందలాది బుల్డోజర్లు, JCBలతో బలవంతంగా విధ్వంసానికి, అటవీ నిర్మూలనకు పాల్పడిందని అన్నారు. ఇక అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిన ఒప్పందం ప్రకారం 534 ఎకరాల హెచ్‌సీయూ భూమిని యూనివర్సిటీకి తిరిగి ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం వందలాది JCBలు, బుల్డోజర్లతో నాశనం చేస్తున్న 400 ఎకరాల భూమిలో అనేక అరుదైన జీవ జాతులు నివసిస్తున్నాయని, ఈ కార్యక్రమాన్ని నిలిపివేసి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని గొప్ప జీవవైవిధ్యాన్ని కాపాడాలని ఏబీవీపీ ఆధ్వర్యంలోని విద్యార్థులు డిమాండ్ చేశారు.

 

 

Similar News