Harshasai: హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన హర్ష సాయి.. లైంగిక ఆరోపణలపై వివరణ

లైంగిక వేధింపుల(Sexual harassment) ఆరోపణలు ఎదుర్కుంటున్న యూట్యూబర్ హర్షసాయి(Harshasai) ఎట్టలకేలకు అజ్ఞాతం వీడారు.

Update: 2024-11-04 10:24 GMT
Harshasai: హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన హర్ష సాయి.. లైంగిక ఆరోపణలపై వివరణ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపుల(Sexual harassment) ఆరోపణలు ఎదుర్కుంటున్న యూట్యూబర్ హర్షసాయి(Harshasai) ఎట్టలకేలకు అజ్ఞాతం వీడారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యక్ష్యమయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు(Airport)లోనే మీడియాతో మాట్లాడారు. తనమీద వచ్చిన ఆరోపణలు అన్నీ అసత్యం అని కొట్టిపారేశారు. తాను కథ రాసి తీసిన సినిమా(Cinema)కు వాళ్లు కాపిరైట్స్ అడగడం ఏంటని ప్రశ్నించారు. తాను ఎక్కడ ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని చెప్పారు. డబ్బు మనిషితో ఏదైనా చేయిస్తుంది.. ఇప్పుడు కూడా అదే జరిగింది అని అన్నారు. కొందరు కావాలనే తనపై కుట్రపూరితంగా అసత్యాలు ప్రచారం చేయించారని ఆరోపించారు.

పోలీసుల విచారణలో అసలు నిజాలు బయటకు వచ్చాయని.. అందుకే ఇవాళ నాకు కోర్ట్ బెయిల్ ఇచ్చిందని హర్ష సాయి(Harshasai) స్పష్టం చేశారు. అయితే, ఆరోపణలు వచ్చినా నుంచి పరారీలో ఉన్న హర్ష సాయి.. విదేశాల్లో గడిపినట్లు సమాచారం. మరోవైపు యూట్యూబ‌ర్ హ‌ర్ష సాయి(Harshasai) త‌న‌ను లైంగికంగా వాడుకొని మానసికంగా వేధిస్తున్నాడని ఇటీవల ఓ యువతి హైదరాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని, శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నది. దీంతో నార్సింగి పోలీసులు హ‌ర్ష‌సాయికి నోటీసులు పంపారు. అప్పటినుంచి హ‌ర్ష‌సాయి పరారీలో ఉన్నారు. సడన్‌గా ఇవాళ ప్రత్యక్ష్యమై వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News