అట్టహాసంగా నియామకపత్రాలు.. అవి మాత్రం లేవు.. హరీష్ రావు సంచలన ట్వీట్

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

Update: 2024-05-21 04:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు చెల్లించడం లేదన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప.. వారికి జీతబత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారని.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు లేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలని చురకలు అంటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలను తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నా అని ట్వీట్ చేశారు.

Click Here For Twitter Post..

Tags:    

Similar News