సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-29 07:42 GMT

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లో కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి శుద్ధపూస మాటలు మాట్లాడటం కాదని.. కోడంగల్ లోని సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు సర్వే నంబర్ 1138లో ఉందన్నారు. కుంటలో ఉన్న నీ ఇంటిని ముందు కూలగొట్టాలని..మీ తమ్ముడి ఇల్లు ఎఫ్టీఎల్ లో ఉందని.. మీకు..మీ తమ్ముడికొక రూల్..గరీబోళ్ళకు మరోక రూలా అని నేను అడుగుతున్నానని హరీశ్ రావు నిలదీశారు. ముందు మీ ఇండ్లు కూల్చుకోండి తర్వాత పేద ప్రజల దగ్గరికి రండని హితవు పలికారు. మీకో న్యాయం పేద ప్రజలకు ఒక న్యాయమా? అంటూ ఆగ్రహించారు. హైదరాబాద్‌ హైదర్‌షాకోట్‌లో మూసీ, హైడ్రా బాధితుల ఇండ్లను ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది.

ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. పేదలకు ఇండ్లు లేకుండా చేయడటమే రేవంత్‌ లక్ష్యంగా ఉందన్నారు. మూసీ ప్రాంతంలో కూల్చివేతలు జరగకుండా మేము అడ్డం కూర్చుంటామని హెచ్చరించారు. కూల్చాలంటే మా మీద నుంచి వెళ్ళాలని… హైడ్రా పుణ్యమాని ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా మూసీ నది ప్రక్షాళన పేరుతో..చెరువుల పరిరక్షణ పేరుతో ప్రజల ఇండ్లను కూల్చడం మానుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా ఉంటామని చెప్పారు. ధైర్యంగా ఉండాలని, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని బాధితులకు ధైర్యం నూరిపోశారు. ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా తామే ఒక రక్షణ కవచం లాగా నిలబడతామన్నారు. బుల్డోజర్ వచ్చినా, జేసీబీ వచ్చినా ముందు మమల్ని ఎత్తాలి తప్ప.. మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదన్నారు.


Similar News