అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్‌ పాలన కొనసాగింది:హరీష్ రావు

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మేధావి , సంఘ సంస్కర్త వర్ణవివక్షత పై పోరాడిన క్రాంతికారుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

Update: 2024-04-11 08:03 GMT

దిశ,వెబ్‌డెస్క్: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మేధావి , సంఘ సంస్కర్త వర్ణవివక్షత పై పోరాడిన క్రాంతికారుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం సిద్ధిపేట లోని తన నివాసంలో మహత్మ జ్యోతిరావు ఫూలే 197 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఫూలే చేపట్టిన కార్యాచరణ, ఆయన సేవలు నేటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన ఆశయాల సాధనకై, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేసీఆర్‌ పాలన కొనసాగిందన్నారు.

డాక్టర్‌ BR అంబేద్కర్‌, ఫూలే, బాబు జగ్జీవన్‌రాం కలలుగన్న పాలనను తాము నిజం చేశామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సామాజిక సమానత్వం దిశగా కృషి చేశామని తెలిపారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆదర్శంగా వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి పూలే గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేశామన్నారు. ఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. బహుజనుల కోసం ఆత్మగౌరవ భవనాలు, బీసీల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తుచేశారు. 


Similar News