మునుగోడుకు ట్రబుల్ షూటర్ ఎంట్రీ.. దిపావళీ తర్వాత మరో కీలక మంత్రి!

మంత్రి హరీష్ రావు మునుగోడు బైపోల్ ప్రచారానికి ఎప్పుడు వెళ్తారనే సస్పెన్షన్‌కు తెరపడింది. నియోజకవర్గానికి వెళ్లడంతో పాటు రోడ్ షో నిర్వహించి బీజేపీ

Update: 2022-10-19 01:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి హరీష్ రావు మునుగోడు బైపోల్ ప్రచారానికి ఎప్పుడు వెళ్తారనే సస్పెన్షన్‌కు తెరపడింది. నియోజకవర్గానికి వెళ్లడంతో పాటు రోడ్ షో నిర్వహించి బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇక మంత్రి కేటీఆర్ గట్టుప్పల్ మండలానికి యూనిట్ ఇన్చార్జీ బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించడంతో ఆయన దీపావళి తర్వాత మునుగోడుకు వెళ్లనున్నారు. ప్రతి రోజూ పార్టీ నేతలతో భేటీలు, సమీక్షలు, సలహాలు ఇస్తూ బీజీబీజీగా గడుపుతున్నారు.

మునుగోడు ఎమ్మెల్యే పదవి రాజగోపాల్ రెడ్డి ఆగస్టు 8న రాజీనామా చేశారు. అప్పటి నుంచి మునుగోడులో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. టీఆర్ఎస్ మంత్రులతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు రాష్ట్ర, జిల్లా కమిటీలు, కార్పొరేషన్ చైర్మన్లను మోహరించింది. ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించేంది. అందుకు ఆయన ప్రణాళిక ప్రకారం వ్యూహాలను రచించేవారు.

అయితే అధిష్టానం మునుగోడు బైపోల్‌లో మర్రిగూడ యూనిట్‌కు ఇన్‌చార్జీగా నియమించింది. కానీ ఇప్పటివరకు హరీష్ రావు వెళ్లలేదు. వెళ్తాడాలేదా? అనేదానిపై సందిగ్ధం నెలకొంది. వీటన్నింటికి తెరదించుతూ మంత్రి మంగళవారం నియోజకవర్గానికి ఎంట్రీ అయ్యారు. మర్రిగూడలో నిర్వహించిన రోడ్డుషోలో పాల్గొని బీజేపీపై, కోమటిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. ఇదిలా ఉంటే మంత్రి కేటీఆర్ ఈ నెల 13న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్ వేదికగా ప్రతి రోజూ మునుగోడు నేతలతో భేటీలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచే నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. దీపావళి తర్వాత నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గట్టుప్పల్ మండలానికి కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించడంతో ప్రత్యేకంగా పార్టీ నేతలతో సమీక్షిస్తున్నారు.

Tags:    

Similar News