TG Assembly: రాష్ట్ర అప్పులపై ప్రభుత్వ పెద్దలవి అబద్ధాలు.. అసెంబ్లీలో హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీ (Assembly) సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి.

Update: 2024-12-17 05:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Assembly) సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) రాష్ట్ర అప్పుల వివరాలను సభలో ప్రకటించారు. 2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు రూ.51,200 కోట్లు అని వెల్లడించారు. అయితే భట్టి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్లుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు ఉందనేది పూర్తిగా అవాస్తవని ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేస్తానని హరీశ్ రావు సవాల్ విసిరారు. 

Tags:    

Similar News