చీకటి ఒప్పందాన్ని బయటపెట్టిన హరీష్ రావు

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది చీకటి ఒప్పందమని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-12 08:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలది చీకటి ఒప్పందమని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో హరీష్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టిందని అన్నారు. కరీంగనర్, మెదక్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థులు డమ్మీలేనని బీజేపీ-కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. అలాగే బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు చేసిన పనులను మరోసారి గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఆరు హామీలు ఏమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం తన ప్రాణాలను పనంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు రైతుల కోసమే ఆలోచిస్తుందన్నారు. బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని హరీష్ రావు చెప్పుకొచ్చారు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక్కటేనని రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికే కంకణం కట్టుకున్నాయని అన్నారు.


Similar News