హరీష్, ఆ విషయం తేల్చుకొని రా చూద్దాం.. చేరికలపై బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) బీజేపీ (BJP) లో చేరుతున్నారన్న ప్రచారంపై నిజమాబాద్ (Nizamabad) బీజేపీ ఎంపీ (BJP MP) ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) హాట్ కామెంట్స్ (Hot Comments) చేశారు.

Update: 2025-02-24 11:09 GMT
హరీష్, ఆ విషయం తేల్చుకొని రా చూద్దాం.. చేరికలపై బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) బీజేపీ (BJP) లో చేరుతున్నారన్న ప్రచారంపై నిజమాబాద్ (Nizamabad) బీజేపీ ఎంపీ (BJP MP) ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) హాట్ కామెంట్స్ (Hot Comments) చేశారు. కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla family) తప్ప ఎవరైనా బీజేపీలో చేరవచ్చు అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం (MLC election campaign) లో పాల్గొన్న ఆయన.. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతారన్నా ప్రచారం (campaign) అయిపోయిందని, వారిని చేరమని చెబుతున్నానని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం తప్ప బీఆర్ఎస్ నుంచి ఎవరు బీజేపీలో చేరినా ఆహ్వానిస్తామని (Invited) సంచలన వ్యాఖ్యలు (sensational Comments) చేశారు.

బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) చేరికపై జరుగుతున్న ప్రచారం పట్ల స్పందిస్తూ.. ముందుగా హరీష్ రావు కల్వకుంట్ల కుటుంబ సభ్యుడా? కాదా? అనేది ఆయనే తేల్చుకోవాలని సూచించారు. హరీష్ ఒక కాలు అటు, మరోకాలు ఇటు పెడతానంటే కుదరదు అని ఎద్దేవా చేశారు. అంతేగాక హరీష్ రావు కేసీఆర్ (KCR) అవినీతికి (corruption), దుర్మార్గపు పాలనకు (misrule), బీజేపీ హిందుత్వ కార్యకర్తలపై (BJP Hindutva workers) జరిపిన దాడులకు, వారిపై పెట్టిన దొంగ కేసులకు (fraudulent cases) భాగమా కాదా అని ప్రశ్నించారు. భాగం కాకపోతే కేసీఆర్ ను విమర్శించిన తర్వాత వచ్చి తమని రిక్వెస్ట్ (Request) చేస్తే.. అప్పుడు ఆలోచిస్తామని బీజేపీ నేత (BJP Leader) అరవింద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా బీఆర్ఎస్ లోని కీలక నేతలు కొందరు బీజేపీ వైపు చూస్తున్నారని, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) సమయానికి ముందే వారు బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News