జర్నలిస్టులకు ఇండ్లు మంజూరు చేయండి: మంత్రి తలసానికి HUJ విజ్ఞప్తి
అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే - టీడబ్ల్యుజేఎఫ్) బృందం మంత్రి
దిశ, తెలంగాణ బ్యూరో: అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే - టీడబ్ల్యుజేఎఫ్) బృందం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ప్రభుత్వం స్థానికంగా ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తోందని, హైదరాబాద్ జిల్లాలో జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు లేదా ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని, సీఎం కేసీఆర్ ఇప్పటికే పలు మార్లు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.
ఈ మేరకు టీడబ్ల్యూజేఎఫ్ కార్యదర్శి ఇ.చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో హెచ్‌యూజే బృందం శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రికి వినతి పత్రం అందజేసింది. మంత్రి స్పందిస్తూ, అన్ని వర్గాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. జర్నలిస్టులకు ఇండ్లు కేటాయింపు తమ దృష్టిలో ఉన్నదని సానుకూలంగా స్పందించారు. మంత్రిని కలిసిన వారిలో హెచ్‌యూజే కార్యదర్శి జగదీశ్, కోశాధికారి రాజశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగవాణి, హెచ్‌యూజే నాయకులు అచ్చిన ప్రశాంత్, రేణయ్య, టీడబ్లూజేఎఫ్ కార్యదర్శి కొప్పు నిరంజన్, పలువురు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు.