ఆర్టీసీలో గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్.. ఈనెల 15 నుంచి షురూ!

ఆర్టీసీలో గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ పేరిట ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. ఈనెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 22 వరకు 100 రోజులు పాటు సంస్థను లాభాల బాట పట్టించేందుకు ఆఫీసర్లు ప్రణాళికను తయారు చేస్తున్నారు.

Update: 2023-10-07 16:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీలో గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్ పేరిట ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. ఈనెల 15 నుంచి వచ్చే ఏడాది జనవరి 22 వరకు 100 రోజులు పాటు సంస్థను లాభాల బాట పట్టించేందుకు ఆఫీసర్లు ప్రణాళికను తయారు చేస్తున్నారు. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతితో పండుగల్లో ప్రజలకు మరింత మెరుగైన నాణ్యమైన సేవలందించాలని సంస్థ ప్లాన్ చేసింది. ఎక్కువ మంది ప్రయాణికులను ఆర్టీసీలో క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రయాణికుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్ల సంస్థకు ఇప్పటికే సత్పలితాలు వస్తున్నాయన్నారు. ఈ ఛాలెంజ్‌తో మరింత ఆదాయం సమకూరనున్నదన్నారు. హైదరాబాద్‌లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్‌లో శనివారం శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్‌లతో పాటు జోనల్ స్థాయి ఉత్తమ ఉద్యోగులు, ఎక్స్ ట్రా మైల్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి సజ్జనార్ ముఖ్య అతిధిగా హాజరై.. 286 మందికి అవార్డులు పంపిణీ చేశారు. అవార్డులు పొందిన వారిలో రాఖీ పౌర్ణమి ఛాలెంజ్‌కు 36, శ్రావణ మాసం ఛాలెంజ్‌కు 30, జోనల్ స్థాయి ఉద్యోగులకు 180, ఎక్స్ ట్రా మైల్‌లో 25, లాజిస్టిక్స్ విభాగంలో 15 మంది ఉన్నారు.డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, హెల్పర్స్, శ్రామిక్‌ల‌తో పాటు సూప‌ర్‌వైజ‌ర్స్‌, డిపో మేనేజ‌ర్స్‌, డిప్యూటీ ఆర్ఎంలు, ఆర్ఎంలు ఉన్నారు. అనంతరం సజ్జనార్ మాట్లాడుతూ.. గత రెండేళ్లలో సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. క్లిష్ట పరిస్థితులను త‌ట్టుకుని తన కాళ్ల మీద తాను నిల‌బ‌డ‌గ‌లిగే స్థాయికి సంస్థ ఎద‌గ‌డం చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రస్థానంలో సిబ్బంది కృషి ఎనలేనిదని వివరించారు. సంస్థ విసిరిన ప్రతి ఛాలెంజ్‌ను సిబ్బంది విజయవంతం చేశారని చెప్పారు.

ఒక్క రోజులో రూ.22.65 రాబడి

రాఖీ పౌర్ణమికి రికార్డుస్థాయిలో ఒక్క రోజులో రూ.22.65 కోట్ల రాబడి రావడం గొప్ప విషయమన్నారు. రాఖీ పౌర్ణమి ఛాలెంజ్లో పస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్ కు రూ.లక్ష, సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ రూ.75 వేలు, థర్డ్ బెస్ట్ రీజియన్ కరీంనగర్ రూ.50 వేలు అందజేయగా..శ్రావణ మాసం ఛాలెంజ్లో పస్ట్ బెస్ట్ రీజియన్ వరంగల్ రూ.లక్ష , సెకండ్ బెస్ట్ రీజియన్ నల్లగొండ రూ.75 వేలు, థర్డ్ బెస్ట్ రీజియన్ ఆదిలాబాద్ రూ.50 వేలు చొప్పును పురస్కారాలు అందజేశామన్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్, సీఎంఈ రఘునాథరావు, సీఎఫ్ఎం విజయ పుష్ఫ, సీసీవోఎస్ విజయ భాస్కర్, సీసీఈ రాంప్రసాద్, సీటీఎం(కమర్షియల్) సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News