Charminar: ఆర్కిటెక్చర్ లైటింగ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చారిత్రక చార్మినార్(Charminar) పరిసరాల్లో ఆర్కిటెక్చర్ లైటింగ్ ప్రాజెక్టు(Architectural Lighting Project)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నయాపూల్ నుంచి చార్మినార్, లాడ్‌బజార్ పరిసరాల్లో ఆర్కిటెక్చర్ లైగింగ్ ఏర్పాటు చేయనున్నారు. రూ.18.19 కోట్లతో పనులు ప్రారంభించనున్నారు. కులీకుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(Kulikuthub Shah Urban Development Authority) ఆధ్వర్యంలో ఈ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు.