ఆయుష్ విధానాలకు ఇది స్వర్ణయుగం: గవర్నర్ తమిళిసై
వివిధ వైద్య పద్ధతుల్లో మేలైన అంశాలతో కూడిన సమీకృత వైద్య విధానమే రోగాల నివారణ, చికిత్సలో అత్యంత కీలకమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: వివిధ వైద్య పద్ధతుల్లో మేలైన అంశాలతో కూడిన సమీకృత వైద్య విధానమే రోగాల నివారణ, చికిత్సలో అత్యంత కీలకమని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వైద్య విధానాలన్నీ చికిత్స కోసమేనని తెలిపారు. ఆదివారం తార్నాకలోని ఐఐసీటీ ఆడిటోరియంలో ‘హోమియోపతి విజ్ఞాన సమ్మేళనం 2023- 24’కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
హోమియో వైద్యానికి మరింత ప్రాచుర్యం కల్పించడానికి లోతైన పరిశోధనలు జరపాలని హోమియో డాక్టర్లకు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆయుష్ విభాగానికి అత్యంత ప్రాధాన్యత దక్కుతుందని, ఆయుష్ విధానాలకు ఇది ఒక స్వర్ణయుగం అని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రెటరీ డాక్టర్ ఎస్.చంద్రశేఖర్, గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్ ప్రతినిధులు, విజ్ఞాన భారతి ప్రతినిధులు, దేశం నలుమూలల నుంచి వచ్చిన హోమియోపతి డాక్టర్లు, పరిశోధకులు పాల్గొన్నారు.
Also Read..
గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసు: రెండు వారాలపాటు వాయిదా వేసిన సుప్రీంకోర్టు