Minister Ponguleti : వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ : మంత్రి పొంగులేటి

వరంగల్ నగర అభివృద్ధి(Warangal city development)పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి(Special focus)సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) వెల్లడించారు.

Update: 2024-12-11 12:25 GMT
Minister Ponguleti : వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ : మంత్రి పొంగులేటి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్ నగర అభివృద్ధి(Warangal city development)పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి(Special focus)సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. వరంగల్ నగర అభివృద్ధిపై మంత్రి పొంగులేటి బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో వరంగల్ జిల్లా మంత్రులు కొండా సురేఖ(Konda Surekha), ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy)లతో కలిసి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రధానంగా వరంగల్ నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్, భ‌ద్రకాళి చెరువు, విమానాశ్రయం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు.

మంత్రి శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీల ఆమలుకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ లను త్వరితగతిన తయారుచేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్ నగరంలో నిర్మించే రింగ్ రోడ్డుతో జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా చూడాలని, ఈ ప్రాజెక్టుకు భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌ను యుద్ధప్రాతిప‌దిక‌న‌, భ‌ద్రకాళి చెరువు శుద్ధీక‌ర‌ణ‌ ప‌నుల‌ను వేగ‌వంతంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

Tags:    

Similar News