మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(congress govt) ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. భూపాలపల్లి జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించారు.

Update: 2024-12-14 11:20 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(congress govt) ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. భూపాలపల్లి జిల్లాలో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిధులు మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్(brs) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదేళ్ల BRS ప్రభుత్వ పాలనలో చేయలేని పనులు మేం ఏడాదిలోనే చేశామని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. భూపాలపల్లిలో పారిశ్రామికపార్క్‌కు శంకుస్థాపన చేశామని, త్వరలోనే 4 లైన్‌ రోడ్డు నిర్మాణం చేస్తామని, తెలంగాణ రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.


Similar News