కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే ప్రభుత్వం లక్ష్యం : మంత్రి సీతక్క

హైదరాబాద్(Hyderabad) పీపుల్స్ ప్లాజాలో శుక్రవారం 'సరస్ ఫెయిర్'(SARUS Fair) ను మంత్రి సీతక్క(Seethakka) ప్రారంభించారు.

Update: 2024-09-27 15:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) పీపుల్స్ ప్లాజాలో శుక్రవారం 'సరస్ ఫెయిర్'(SARUS Fair) ను మంత్రి సీతక్క(Seethakka) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రానున్న ఐదేళ్లలో మహిళల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు పెడతామని వెల్లడించారు. 17 రకాల వ్యాపారాల్ని గుర్తించి, వాటిపై మహిళకు వడ్డీలేని రుణాలు అందించి వారిని కోటీశ్వరులుగా తీర్చి దిద్దుతాం అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే ఆ ఊరు, రాష్ట్రం, దేశం బాగుపడుతుందని సీతక్క పేర్కొన్నారు. కాగా పూర్తిగా గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన అయిన 'సరస్' నేటి నుండి అక్టోబర్ 7 వరకు కొనసాగనుంది.  


Similar News