Digital Mode: ఇక పాఠశాల విద్య డిజిటల్ మయం.. ఆ సంస్థతో ప్రభుత్వం ఎంఓయూ
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్న రేవంత్‌రెడ్డి సర్కార్ తాజాగా ఏఐ ద్వారా పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పుల దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో (AI) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్న రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ తాజాగా ఏఐ ద్వారా పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పుల దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. (School education) పాఠశాల విద్యను (Digital Mode) డిజిటల్ మోడ్‌లోకి మార్చాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇంప్రూవ్ చేయడంలో ఏఐ వినియోగించాలని నిర్ణయించింది.
సాంకేతిక వినియోగంపై టీచర్లకు శిక్షణను సైతం ఇప్పించేలా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని ఏక్ స్టెప్ ఫౌండేషన్‌ను తాజాగా తెలంగాణ విద్యాశాఖ అధికారులు సందర్శించారు. కాగా తొలిదశలో 3,673 పాఠశాలల్లోని 7,346 తరగతుల్లో తక్షణమే డిజిటల్ స్క్రీన్ ద్వారా బోధన జరిగేలా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.