విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొత్త మెనూ ప్రారంభం
రాష్ట్రంలో గత కొన్ని రోజులగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆహారం కల్తీ కావడంతో 42 మంది విద్యార్థులు చనిపోవడమే గాక చాలా మంది ఆసుపత్రుల పాలయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గత కొన్ని రోజులగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆహారం కల్తీ కావడంతో 42 మంది విద్యార్థులు చనిపోవడమే గాక చాలా మంది ఆసుపత్రుల పాలయ్యారు. ఆ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక కొత్త నియమం ప్రవేశపెడుతుందని సమాచారం. ప్రజాపాలనలో విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకోసం సీఎం రేవంత్ రెడ్డి సర్కారు అడుగులు వేస్తుందని, పేద వర్గాల విద్యార్థులకు పోషకాహారం అందించడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతిగృహాలలో కొత్త ఆహార నియమావలి తీసుకొస్తున్నారని శనివారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ నియమావలిలో పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం డైట్ ఛార్జీలను (Diet charges) 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను (Cosmetic charges) 200 శాతం పెంచనున్నట్లు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో 8 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగబోతుందని మంత్రి సీతక్క చెప్పారు. ఈ మెనూ నేటి నుండే అమలు కాబోతుందని ఆమె తెలిపారు. విద్యార్థుల పరిస్థితులను అర్ధం చేసుకొని ఈ కొత్త డైట్ షీట్ తో (new diet sheet) పాటు డైట్ చార్జీలు పెంచమని స్పష్టం చేశారు.