IPhone : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్..వచ్చేస్తున్న ఎస్ఈ 4
ఆపిల్ ఐ ఫోన్(Apple IPhone)అభిమానులకు ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్(CEO Tim Cook) గుడ్ న్యూస్(Good news)వెల్లడించారు. ఆపిల్ ఫోను కొనుగోలు దారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ ఎస్ఈ 4( IPhone SE 4)ను ఫిబ్రవరి 19న లాంచ్(Launch) చేయనున్నట్లుగా ఎక్స్ వేదికగా ప్రకటించారు

దిశ, వెడ్ డెస్క్ : ఆపిల్ ఐ ఫోన్(Apple IPhone)అభిమానులకు ఆపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్(CEO Tim Cook) గుడ్ న్యూస్(Good news)వెల్లడించారు. ఆపిల్ ఫోన్ కొనుగోలు దారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ ఎస్ఈ 4( IPhone SE 4)ను ఫిబ్రవరి 19న లాంచ్(Launch) చేయనున్నట్లుగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. వెండి వర్ణంలో మెరిసిపోతున్న ఆపిల్ లోగోను కుక్ షేర్ చేశారు. ఈ కొత్త ఆపిల్ ఫోన్ ఎస్ఈ(SE)సిరీస్‌లో నాల్గవ ఐఫోన్ కానుండటం విశేషం.
2022 మోడల్ - ఐఫోన్ ఎస్3(SE 3) తర్వాత వస్తున్న ఈ కొత్త తరం మోడల్ ఎస్ఈ 4( SE 4)చాలా మంచి డిజైన్, స్పెసిఫికేషన్లు, కొత్త ఫీచర్ల అప్‌గ్రేడ్‌లతో వస్తుందని సమాచారం. అందుతున్న సమాచారం మేరకు ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ(SE 4) సరికొత్త ఆకర్షణీయ రూపంతో ఐఫోన్ 14 తరహాలో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైన సెలెక్టివ్ ఏఐ(AI)ఫీచర్‌లతో వస్తుందని తెలుస్తోంది. ఐఫోన్ ఎస్ఈ4 భారత్, చైనా వంటి పెద్ద దేశాల మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని వస్తున్న బడ్జెట్ ఫోన్ గా నిపుణులు చెబుతున్నారు.
ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 4(SE 4) ఫోన్ గూగుల్, శామ్ సంగ్ మిడ్ రేంజ్ స్మార్టు ఫోన్ల మార్కెట్ కు పోటీగా ఉండవచ్చంటున్నారు. ఐఫోన్ ఎస్ఈ4(SE4) ధర భారతదేశంలో రూ.50,000 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.