చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులకు ప్రయోజనం చేకూర్చే త్రిప్ట్ పథకానికి సంబంధించిన నిధులు 90 కోట్లు విడుదల చేసింది.

Update: 2024-08-31 14:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులకు ప్రయోజనం చేకూర్చే త్రిప్ట్ పథకానికి సంబంధించిన నిధులు 90 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలో 36,133 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి అధికారులకు పద్మశాలి సంఘం ఎల్బీనగర్ సర్కిల్ సంఘం అధ్యక్షుడు పున్న గణేష్ నేత కృతజ్ఞతలు తెలిపారు. శనివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సచివాలయంలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ను చేనేత కార్మికులు కలిశారు. ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కళాకారుల సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నదని తెలిపారు.

ఇప్పటికే నేతన్నల బీమాకు అవసరమైన నిధులను కూడా బీమా కంపెనీ చెల్లించడం జరిగిందన్నారు. సెప్టెంబర్ రెండో వారంలో హైదరాబాద్ లో ఒక చేనేత సభ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్రిఫ్టు పథకం లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. పున్న గణేష్ మాట్లాడుతూ.. కష్టాలలో ఉన్న నేతన్నలకు త్రిఫ్ట్ నిధుల విడుదల ఊరట లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు బొమ్మ రఘురాం నేత, గుర్రం శ్రావణ్, గడ్డం లక్ష్మీనారాయణ, కౌకుంట్ల రవితేజ, తలాటి రమేష్, జెల్ల సూర్యకాంత్, జెల్ల జగన్నాథం, జెల్ల నరేందర్ పాల్గొన్నారు.


Similar News