తెలంగాణ గజల్ దిగ్గజం ఇందిర భైరి కన్నుమూత
ప్రముఖ గజల్ రచయిత్రి ఇందిర భైరి ఆదివారం అనారోగ్యంతో మరణించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ గజల్ రచయిత్రి ఇందిర భైరి ఆదివారం అనారోగ్యంతో మరణించారు. వందల సంఖ్యలో గజల్స్రాసిన ఇందిరా భైరి.. తెలంగాణ గజల్ దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తెలంగాణ గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం, మన కవులు వంటి గజల్స్సంకలనాలు ఆమెకు విశేష పేరును తీసుకొచ్చాయి. రావి రంగారావు సాహిత్య కళాపీఠం నుంచి 'జనరంజక కవి పురస్కారం' సైతం ఆమె అందుకున్నారు. మహిళా గజల్స్రచయితల్లో తొలిసారిగా గజల్స్సంకాలను విడుదల చేసి చరిత్ర సృష్టించారు.
హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తూనే తీరిక సమయాల్లో వందల సంఖ్యలో గజల్స్రాశారు. బతుకమ్మ, తెలంగాణ అమరవీరులు, ఉద్యమ నేపథ్యం, సాయుధ పోరాటం, మన పండుగలపై ఇందిరభైరి అనేక గజల్స్ రాశారు. ఆమె కూతురు సైతం ప్రముఖ గజల్స్కళాకారిణి హిమజా రామమ్. ఈ తల్లీబిడ్డలు కలిసి తెలంగాణ గజల్స్సాహిత్యానికి విశేష కృషి చేశారు. నిజాంపేటలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.