క్షణాల్లో ఓటరు గుర్తింపు కార్డు పొందండిలా..!

అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2023-10-17 02:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ - ఓటరు గుర్తింపు కార్డును డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. అందుకోసం వెబ్ సైట్ లో కీలక మార్పులు చేసినట్లు తెలిపింది. ఈ పద్ధతిలో మొబైల్ నంబర్ నమోదుతో క్షణాల్లో ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చని ఈసీ తెలిపింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇది చెల్లుబాటు అవుతుందని ఈసీ స్పష్టం చేసింది.

ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం రూపొందించిన ఫామ్ -8నే ఇందుకోసం ఉపయోగించాల్సి ఉంటుందని పేర్కొంది. అప్లికేషన్ ఫామ్ లో మొబైల్ నంబర్ ఎంట్రీ చేసేందుకు ఓ సెపరేట్ కాలమ్ ఉంటుందని.. దాన్ని క్లిక్ చేసిన తర్వాత సబ్ మిట్ చేయాలని తెలిపింది. https://voters.eci.gov.in/ లో e-epic విభాగంలోకి వెళ్లి నిర్ధేశించిన చోట ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుంది.

ఏ మొబైల్ నంబర్ ఎంట్రీ చేశామో ఆ నంబర్‌కు వెంటనే ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయగానే ఈ-ఓటర్ గుర్తింపు కార్డు డౌన్ లోడ్ అవుతుంది. ఎన్నికల సంఘం పంపే ఓటరు గుర్తింపు కార్డు కోసం వేచి చూడకుండా ఈ పత్రం అన్ని ధ్రువ పత్రాల మాదిరిగా చెల్లుబాటు కానుంది. గతంలోనూ ఈ ఫెసిలిటీ ఉన్నప్పటికి మెన్షన్ చేసిన వివరాలు అసెంబ్లీ సెగ్మెంట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆమోదించిన తర్వాత ప్రక్రియ పూర్తయ్యేది.

Tags:    

Similar News