బిగ్ న్యూస్: ప్రొ. కోదండ రామ్‌కు బిగ్ షాక్.. TJS పార్టీకి కీలక నేత రాజీనామా
తెలంగాణ జనసమితిలో కీలక నేతగా ఉన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాపురం వెంకట్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జనసమితిలో కీలక నేతగా ఉన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగాపురం వెంకట్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన.. శనివారం పార్టీకి తన రాజీనామాను సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా 2009 నుంచి 2014 వరకు తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా గంగాపురం వెంకటరెడ్డి ఉన్నారు.
2000 నుంచి 2009 వరకు ఉమ్మడి ఏపీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు. టీజేఎస్ పార్టీ విధానపరమైన నిర్ణయాలతో విభేదిస్తున్నానని, అందుకే టీజేఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. గత 14 ఏళ్లుగా ప్రొఫెసర్ కోదండరాం సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో బీజేపీ పార్టీలోకి చేరబోతున్నట్లు గంగాపురం వెంకట్‌రెడ్డి ‘‘దిశ’’ పేపర్‌కు ఫోన్ కాల్ ద్వారా తెలియజేశారు.