HYD: అరుదైన జంతువులతో ఆటలు.. పబ్‌ ఓనర్‌కు 24 గంటల డెడ్ లైన్

Update: 2023-05-31 04:29 GMT
HYD: అరుదైన జంతువులతో ఆటలు.. పబ్‌ ఓనర్‌కు 24 గంటల డెడ్ లైన్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: అరుదైన అటవీ జంతువులను పబ్‌లో ఉంచి కస్టమర్లను ఆకర్షిస్తున్న పబ్‌పై యాక్షన్‌కు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ సిద్ధమవుతోంది. పబ్ ఓనర్ వినయ్ రెడ్డికి 24 గంటల డెడ్ లైన్ విధించింది. 24 గంటల్లోగా అనుమతి పత్రాలు సమర్పించాలని నోటీసుల్లో కోరింది. వన్యప్రాణుల ప్రదర్శనకు లైసెన్స్ ఉందని పబ్ ఓనర్ వినయ్ రెడ్డి అంటున్నారు. ఎక్సోటిక్ పెట్ షాప్ నుంచి 23 రకాల వన్యప్రాణులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరుదైన పర్షియన్, బెంగాల్ క్యాట్ లు, సంపన్నులు పెంచుకునే వన్యప్రాణులను అధికారులు గుర్తించారు. పబ్ ఓనర్ వినయ్ రెడ్డి, పెట్ షాప్ యజమాని వంశీ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే పబ్ లో అరుదైన జాతి జంతువులు ఉంచడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News