GEF India : సీఎస్ఆర్ నిధులతో ఫ్రీడం పార్క్ ఏర్పాటు చేసిన జీఈఎఫ్ ఇండియా

కూకట్‌పల్లి లో రూ.2.76 కోట్లతో అభివృద్ధి చేసిన ఫ్రీడం పార్క్‌ను జీఈఎఫ్ ఇండియా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్, అక్షయ్ చౌదరి, జీఈఎఫ్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్ర శేఖర రెడ్డి ప్రారంభించారు.

Update: 2024-11-07 12:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కూకట్‌పల్లి లో రూ.2.76 కోట్లతో అభివృద్ధి చేసిన ఫ్రీడం పార్క్‌ను జీఈఎఫ్ ఇండియా గ్రూప్ వైస్ ప్రెసిడెంట్, అక్షయ్ చౌదరి, జీఈఎఫ్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్ర శేఖర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్షయ్ చౌదరి మాట్లాడుతూ ఫ్రీడమ్ హెల్తీ వంట నూనెల తయారీదారులు, జెమిని ఎడిబుల్, ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (GEF India) కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR funds) కార్యక్రమంలో భాగంగా ఈ 'ఫ్రీడం పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు.

జాగింగ్, వాకింగ్ ట్రాక్, ఒక అంఫీ థియేటర్, వసతులతో 'ఫ్రీడం పార్క్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కుటుంబ సమావేశాలు, కమ్యూనిటీ సమావేశాలు, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించేహించేందుకు ఈ పార్క్ దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

Tags:    

Similar News